సైరాలో తమన్నా పాత్ర అదేనా…?

Published on Sep 19, 2019 7:10 am IST

ప్రతిష్టాత్మక సైరా ట్రైలర్ నిన్న విడుదలై విశేష స్పందన దక్కించుకుంది. దాదాపు రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ వీరోచిత పోరాటాలు, అబ్బురపరిచే విజువల్స్ తో ఆసక్తికరంగా సాగింది.చిరంజీవి నట విశ్వరూపం మనం తెరపై చూడనున్నామని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

కాగా ఈ మూవీలో ఫిమేల్ లీడ్ పాత్రలు చేసిన నయనతార, తమన్నా లకు ఈ చిత్రంలో అధికప్రాధాన్యం ఉంటుందని ట్రైలర్ ఆధారంగా చెప్పొచ్చు. ముఖ్యంగా తమన్నా పాత్ర ఆసక్తిని రేపుతుంది . ‘లక్ష్మీ అనే నాపేరుముందు నరసింహ అనే మీ పేరు ఇవ్వండి చాలు’ అని అడగడం చూస్తే సమాజానికి తెలియని నరసింహారెడ్డి భార్యగా లేదా ఆయన భార్య కావాలని తపించే యువతిగా తమన్నా పాత్ర ఉంటుందనిపిస్తుంది.

ఈ చిత్రంలో నయనతార నరసింహారెడ్డి భార్య పాత్ర చేస్తున్నారు. ఇక తమన్నా, చిరంజీవి, నయనతారల పాత్రల మధ్య ఆసక్తిగొలిపే భావోద్వేగ సన్నివేశాలు ఉండే అవకాశం కలదు. ఇక బాహుబలి తరువాత సైరా లో మరో మారు కీలకపాత్ర దక్కించుకున్న తమన్నా అటు ఎమోషన్స్ తోపాటు ఇటు వీరోచిత సన్నివేశాలలో అలరిస్తారనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More