“పుష్ప” కోసం అవపోసన పడుతున్న బన్నీ.?

“పుష్ప” కోసం అవపోసన పడుతున్న బన్నీ.?

Published on May 19, 2020 8:01 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం అందులోనూ పాన్ ఇండియన్ సినిమాగా అనౌన్స్ చెయ్యడంతో ఈ చిత్రంపై మరింత హైప్ వచ్చింది. ఈ చిత్రం ఎర్రచందనం మాఫియా నేపథ్యంలో తెరకెక్కనుందన్న సమాచారం తెలిసిందే,అలాగే ఈ చిత్రంలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడి అలరించబోతున్నారు.

ఇప్పుడు ఈ అంశానికి సంబంధించే ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. మామూలుగానే ఎలాంటి యాసను అయినా ఓన్ చేసుకొని చాలా ఈజ్ గా పలికించడం బన్నీలోని ప్రత్యేకత. అది ఇప్పటికే “రుద్రమదేవి”లో గోన గన్నారెడ్డిగా మాట్లాడినప్పుడు కానీ అల వైకుంఠపురములో చిత్రంలో విలన్ రోల్ తో జరిగే సంభాషణలో కానీ మనం గమనించొచ్చు. అలా ఇప్పుడు మరో కోణం కోసం బన్నీ పూర్తిగా చిత్తూరు భాషను అవపోసన పట్టేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే చాలా నేర్చుకుంటున్న బన్నీ ఆ యాసలోని మూలలను కూడా కనుగొనే పనిలో పడ్డారని తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో బన్నీ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు