ప్రభాస్, మారుతి సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్.!

ప్రభాస్, మారుతి సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Jan 14, 2024 5:00 PM IST


ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు చిత్రాల్లో ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్న సినిమా దర్శకుడు మారుతితో చేస్తున్నది కూడా ఒకటి. మరి ఈ సినిమా కంప్లీట్ గా ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా మేకర్స్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం పై ఇప్పుడు మంచి బజ్ నెలకొంది. ఇక రేపు ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేస్తుండగా దీనిపై ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ సినిమాకి గాను మేకర్స్ రాజా సాబ్ అనే టైటిల్ రిలీజ్ చేస్తారని బజ్ వినిపిస్తోంది. ఇక ఫస్ట్ లుక్ గా అయితే ఓ మాస్ లుక్ పోస్టర్ ని ప్రభాస్ పై రిలీజ్ చేస్తారని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ఇక ఈ సినిమాతో మాళవిక మోహనన్ టాలీవుడ్ డెబ్యూ అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు