విజయ్ “గోట్” పై ఇంట్రెస్టింగ్ టాక్.!

విజయ్ “గోట్” పై ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Feb 17, 2024 1:04 PM IST


ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 68వ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రమే “గోట్”(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఇక “లియో” హిట్ తర్వాత భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అయితే ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరకు పోస్టర్స్ చూస్తే యంగ్ ఏజ్ విజయ్ ఓల్డ్ ఏజ్ విజయ్ ఇద్దరు కనిపిస్తున్నారు.

మరి ఈ వీరి పాత్రలపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఇందులో ఒక విజయ్ పాత్రకి నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. అలాగే సినిమాలో అదే మెయిన్ నెగిటివ్ పాత్ర కూడా కావచ్చని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు