ఇంట్రెస్టింగ్.. “బాలయ్య 109” రిలీజ్ డేట్ ఖరారు!?

ఇంట్రెస్టింగ్.. “బాలయ్య 109” రిలీజ్ డేట్ ఖరారు!?

Published on May 19, 2024 7:01 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర్వశి రౌటెలా అలాగే బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కలయికలో బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న సూపర్ మాస్ యాక్షన్ డ్రామా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా (NBK 109) తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక మళ్లీ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది కూడా బాలయ్య అభిమానుల్లో మంచి ఆసక్తి గా మారింది. అయితే ఇప్పుడు దీనిపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కానుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇదే డేట్ లో నందమూరి మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” (Devara) ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే డేట్ బాలయ్య సినిమాకి కూడా వినిపిస్తోంది. అయితే దేవర ప్రీ పోన్ కావచ్చని రూమర్స్ ఉన్నాయి. దాని బట్టి బాలయ్య 109 లాక్ అయ్యిందేమో చూడాలి. ఇక ఈ దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు