ఇంట్రెస్టింగ్ : టిల్లు స్క్వేర్ ఓకే, ఇక ఫ్యామిలీ స్టార్ వంతు

ఇంట్రెస్టింగ్ : టిల్లు స్క్వేర్ ఓకే, ఇక ఫ్యామిలీ స్టార్ వంతు

Published on Apr 4, 2024 12:02 AM IST

టాలీవుడ్ యువ నటుల్లో ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ కూడా ఉంటారు. తాజాగా మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్క్వేర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన సిద్దు, ఆ మూవీతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా యుఎస్ఏ లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ అదరగొడుతోంది. సమ్మర్ సీజన్ కావడంతో పాటు అపోజీషన్ లో సరైన మరొక మూవీ లేకపోవడంతో కలెక్షన్ మరింతగా పెరుగుతోంది.

ఇక మరోవైపు ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ మూవీతో విజయ్ దేవరకొండ ఆడియన్స్ ముందుకి రానున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరిలో మంచి ఇంపాక్ట్ ఏర్పరిచిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తప్పకుండా సక్సెస్ అవుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రీ బుకింగ్స్ కూడా మెల్లగా ఊపందుకుంటున్నాయని, చూడబోతే ఫస్ట్ డే మంచి టాక్ లభిస్తే ఫ్యామిలీ స్టార్ కూడా అన్ని సెంటర్స్ లో అదరగొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ విధంగా టిల్లు స్క్వేర్ వంతు అయిపోగా ఇక ఫ్యామిలీ స్టార్ ది మిగిలింది. మరి ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు