ధనుష్ బెంచ్ మార్క్ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్?

ధనుష్ బెంచ్ మార్క్ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్?

Published on Jan 20, 2024 9:00 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో రీసెంట్ గా భారీ చిత్రం “కెప్టెన్ మిల్లర్” తో తన కెరీర్ లో మరో మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక దీని తర్వాత తన కెరీర్ 51వ చిత్రంని దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేయగా ఈ చిత్రంపై కూడా మంచి బజ్ నెలకొంది.

అయితే వీటితో పాటుగా ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో తన కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 50వ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్ల కితమే దీని షూటింగ్ కూడా తాను కంప్లీట్ చేసాడు. మరి ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. కోలీవుడ్ బజ్ ప్రకారం ఈ చిత్రానికి “రాయణ్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇదే తెలుగు రిలీజ్ ఉంటే “రాయుడు” అని ఉండవచ్చు. అలాగే ఈ రానున్న రెండు మూడు నెలల్లోనే సినిమా రిలీజ్ ఉండొచ్చని కూడా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు