నాగార్జున, ఆర్జీవీ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !

‘శివ’ వంటి క్లాసిక్ హిట్ ను పరిశ్రమకు అందించిన రామ్ గోపాల్ వర్మ, నాగార్జునల కాంబోలో నాలుగవ సినిమా రూపొందనుంది. గతేడాది ఆఖరులో మొదలైన ఈ చిత్రం హైదరాబాద్లో ఒక షెడ్యూల్ ను ముగించుకుని ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ను ముంబైలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘శపథం’ అనే టైటిల్ ను దానికి ‘రివెంజ్ కంప్లీట్స్’ అనే ట్యాగ్ లైన్ ను అనుకుంటున్నారట. గతంలో కూడా ఇలాగే కొన్ని టైటిల్స్ వినబడ్డాయి. మరి వీటిలో దేన్ని ఫైనల్ చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్ గా నటిస్తోంది.