రాజమౌళి మల్టీ స్టారర్ కు ఆసక్తికర టైటిల్ ?

రాజమౌళి మల్టీ స్టారర్ కు ఆసక్తికర టైటిల్ ?

Published on Nov 11, 2018 12:30 AM IST

ఇంతవరకు అపజయం అంటూ ఎరుగని దర్శకుడు ఒక వైపు అలాగే కల్లక్క్షన్స్ తో రికార్డులను సృష్టించే ఇద్దరు స్టార్ హీరోలు మరో వైపు . వీరి ముగ్గురి కలయికలో సినిమా వస్తుదంటే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయో చెప్పనక్కర్లేదు. అదే ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి , రామారావు , రామ చరణ్ మాత్రమే కాదట అందులోనే టైటిల్ దాగి ఉందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ అంటే ‘రామ రావణ రాజ్యం’ అని ఈటైటిల్ నే సినిమాకు ఫిక్స్ చేయనున్నారని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈ టైటిల్ ఫై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు.

ఇక ఈ చిత్రాన్ని రేపు గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అదే రోజు చిత్రం యొక్క టైటిల్ ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సుమారు 200కోట్ల బడ్జెట్ తో దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు