వెంకటేష్ నెక్స్ట్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ?

వెంకటేష్ నెక్స్ట్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ?

Published on Feb 29, 2024 3:01 AM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ ఇటీవల యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యావరేజ్ విజయం అందుకుంది. ఇక దీని అనంతరం వెంకటేష్ చేయనున్న మూవీ పై అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. అయితే తన నెక్స్ట్ మూవీని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేష్ చేయనున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

మంచి కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందనుందట. మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క టైటిల్ కూడా లాక్ అయినట్లు చెప్తున్నారు. కాగా ఈ మూవీకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ లాక్ చేశారట. అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన అన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించనున్నారట. గతంలో అనిల్ రావిపూడితో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు వెంకటేష్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు