
‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో ఉన్న రజనీ, ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆగష్టు నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కాళి అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే టైటీల్తో రజనీ ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే! ఇదే టైటిల్ మళ్ళీ పరిశీలనలోకి రావడం విశేషంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా అఫీషియల్ ప్రకటనేదీ రాలేదు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ తన వయసుకు సరిపోయే తరహా పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారట.