రాజశేఖర్ ను ‘కల్కి’ ఏం చేస్తాడో ?

Published on May 31, 2019 2:00 am IST

‘గరడవేగ’ విజయోత్సాహంతో ‘కల్కి’గా రాబోతున్నాడు డా.రాజశేఖర్. అయితే కల్కిలో యాక్షన్ సీన్స్ మరి ఎక్కువయ్యాయని.. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్ మూడ్ లోనే సాగుతుందని తెలుస్తోంది. మరి రాజశేఖర్ మీద మోతాదుకు మించిన యాక్షన్ వర్కౌట్ అవుతుందా.. పైగా సినిమా నేపధ్యం, కథనం కాస్త కొత్తగా ఉంటాయట.

సగటు ప్రేక్షకుడికి ఆకట్టుకొని ‘అ’ లాంటి గొప్ప సినిమా తీసిన ప్రశాంత్ వ‌ర్మనే ‘కల్కి’కి దర్శకుడు. ఈ సినిమాని కూడా ప్రశాంత్ వ‌ర్మ ప్రేక్షకుడి తెలివితేటలకు పరీక్ష మాదిరిగా తెరకెక్కించి ఉంటే.. బి.సి ప్రేక్షకులను ఇక సినిమాకి దూరం చేసినట్లే. అయితే ఇటివలే ఈ చిత్రం టీజర్ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. మరి రాజశేఖర్ ని ‘కల్కి’ ఏం చేస్తాడో చూడాలి.

ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కూడా కెకె రాధామోహన్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More