ఎన్టీఆర్ – చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

RRR1

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో.. అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఓ జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే.. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట. రామ్ చరణ్ పాత్రను ‘శ్రీ రాముడు’ క్యారెక్టర్ ఆధారంగా డిజైన్ చేస్తే.. ఎన్టీఆర్ పాత్రను రావ‌ణుడి ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో గాని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version