‘సుడిగాడు – 2’ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

‘సుడిగాడు – 2’ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Apr 23, 2024 12:00 AM IST

అల్లరి నరేష్ హీరోగా ప్రస్తుతం అంకం మల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ మూవీని మే 3న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఇక నేటి ఈ మూవీ యొక్క థియేట్రికల్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ, తాను గతంలో నటించిన సూపర్ హిట్ మూవీ సుడిగాడు 2 కి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, వచ్చే ఏడాది ఆ మూవీ ఆడియన్స్ ముందుకి వస్తుందని తెలిపారు. మొత్తంగా ఈ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తో కామెడీ మూవీ లవర్స్ లో సుడిగాడు 2 పై మరింతగా ఇంట్రెస్టింగ్ ఏర్పడిందిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు