మహేష్ బాబు నిజంగానే ఒప్పుకున్నాడా ?

మహేష్ బాబు నిజంగానే ఒప్పుకున్నాడా ?

Published on Feb 25, 2020 12:21 AM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అతిధి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని.. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి కొరటాల శివ మహేష్ కి చెప్పారని.. మహేష్ కూడా అతిధి పాత్రలో నటించడానికి అంగీకరించారని నిన్నటినుండి సోషల్ మీడియాలో వరుస కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకీ మహేష్ ఈ సినిమాలో ఒప్పుకున్నాడా లేదా ఆరా తీస్తే ఈ వార్త కేవలం రూమర్ అని తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారట. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట. ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు