ప్రీ క్లైమాక్స్ ను షూట్ చేస్తోన్న ‘ఎఫ్ 3’ !

ప్రీ క్లైమాక్స్ ను షూట్ చేస్తోన్న ‘ఎఫ్ 3’ !

Published on Mar 2, 2021 3:00 AM IST

వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘ఎఫ్ 3’. వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొడుతూ ఈ క్రమంలో చేస్తోన్న సినిమా ‘ఎఫ్ 3’. అయితే ఈ సినిమాలో సునీల్ కి చాల కాలం తరువాత మంచి క్యారెక్టర్ దొరికిందట. ఓ గెస్ట్ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందట. ప్రస్తుతం ఈ సీన్స్ నే షూట్ చేస్తున్నారట.

కాగా ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో సునీల్ చాలా బాగా నటిస్తున్నాడట. ఇక ఇప్పటికే ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ లో కొంత ఎమోషన్ అండ్ మెసేజ్ కూడా యాడ్ చేశాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు