“జైలర్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“జైలర్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Feb 23, 2024 10:11 AM IST

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన రీసెంట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే రెండో అతి పెద్ద హిట్ గా నిలవగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని వచ్చిన వార్తలు మరింత హైప్ ని తీసుకొచ్చాయి. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

జైలర్ 1 లో చిన్న పాత్ర చేసిన యంగ్ నటి మిర్న పార్ట్ 2 కోసం మాట్లాడుతూ తాను రీసెంట్ గా దర్శకుడు నెల్సన్ తో మాట్లాడానని అయితే తాను ప్రస్తుతం జైలర్ 2 స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలిపింది. అలాగే పార్ట్ 2 లో తాను ఉందో లేదో అనేది మాత్రం కంప్లీట్ గా దర్శకుని చేతిలోనే ఉందని ఆమె తెలియజేసింది. ఇక ఈ సాలిడ్ హిట్ చిత్రంలో శివ రాజ్ కుమార్ మరియు మోహన్ లాల్ లు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు