నాని నెక్స్ట్ ప్రాజక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

నాని నెక్స్ట్ ప్రాజక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Feb 16, 2024 3:01 AM IST

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేస్తున్న యక్షన్ మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక దీని తరువాత నాని చేయబోయే రెండు ప్రాజక్ట్స్ గురించి పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి.

అందులో ఒకటి బలగం డైరెక్టర్ వేణు తో చేయనున్న మూవీ. కాగా ఈ ప్రాజక్ట్ గురించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే, దీనిని రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగె ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. ఇందులో నాని క్యారెక్టర్ అద్భుతంగా రాసుకున్నారట దర్శకుడు వేణు. ఇక ఈ మూవీని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుండగా అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు