రానా అచ్చం చంద్రబాబులానే ఉంటాడంట !

రానా అచ్చం చంద్రబాబులానే ఉంటాడంట !

Published on Aug 19, 2018 5:29 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ ను చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవలే విడుదల అయిన ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య లుక్ కి విపరీతమైన స్పందన వచ్చింది. బాలయ్య అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నారని కామెంట్స్ వినిపించాయి. అలాగే చంద్ర‌బాబు నాయుడు పాత్రను పోషిస్తున్న రానా లుక్ కూడా అచ్చం చంద్రబాబును పోలి ఉంటుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రత్యేకంగా బాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. ఆ కారణంగానే గెటప్స్ అన్ని చాలా సహజంగా వస్తున్నాయట.
బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు