‘దేవర’ లాంగ్ షెడ్యూల్ కి రెడీ ?

‘దేవర’ లాంగ్ షెడ్యూల్ కి రెడీ ?

Published on Apr 22, 2024 8:57 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఐతే, ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ లో ఉండటంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజా అప్ డేట్ ప్రకారం.. దేవర బ్యాలెన్స్ షూట్ కోసం లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది. మే మొదటి వారం నుంచి ‘దేవర’ బ్యాలెన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

అటు సైఫ్ అలీఖాన్ కూడా మే రెండో వారం నుంచి డేట్స్ ఇచ్చాడని టాక్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఎలాగూ ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ వేగంగా జరగనుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు