ప్రశాంత్ వర్మ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

ప్రశాంత్ వర్మ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 19, 2024 5:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ జెనరేషన్ దర్శకుల్లో తమ టాలెంట్ తో పాన్ ఇండియా మార్కెట్ లో కూడా సత్తా చాటినవారు ఉన్నారు. మరి వీరిలో తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో సినిమా చేసి సెన్సేషనల్ హిట్ కొట్టిన “హను మాన్” దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకరు.

మరి ప్రశాంత్ వర్మ నుంచి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర చిత్రాలు రాబోతుండగా ఈ చిత్రాల్లో తన బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. బాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ తో ఓ చిత్రం తాను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందని టాక్ ఉంది.

మరి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వినిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యిన షూట్ తో ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని ప్రశాంత్ వర్మ తనదైన మార్క్ వినూత్నతతో ప్లాన్ చేస్తున్నాడట. దీనినే అతి త్వరలో రిలీజ్ చేసి ప్రకటించనున్నారని వినిపిస్తుంది. ఇక ఈ కాంబినేషన్ లో ఏ తరహా సినిమాతో రాబోతున్నారా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు