మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ కోసం త్వరలోనే యుఎస్ వెళ్లనుంది. వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 17 వరకు యుఎస్ లో లాంగ్ షెడ్యూల్ ను చిత్రబృందం ప్లాన్ చేసింది.
కాగా నలభై రోజులకు పైగా చిత్రీకరణ కోసం అరవైమంది సభ్యులతో చిత్రబృందం త్వరలో యుఎస్ బయల్దేరనుంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, అక్కడ ఉన్న అందమైన ప్రదేశాల్లో కొన్ని పాటలను కూడా చిత్రీకరించనున్నారు.
అయితే యుఎస్ లోని కొంతమంది స్థానికులు ఈ షెడ్యూల్ షూట్ కోసం చిత్ర నిర్మాతలకు సహాయపడనున్నారట. గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది .
