ఆసక్తి రేపుతున్న ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ అప్డేట్

Published on Mar 13, 2020 7:00 am IST

స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కొంచెం గ్యాప్ దొరికినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో జరిగిన షెడ్యూల్ పూర్తికావడంతో వారికి నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యే వరకు స్వల్ప విరామం లభించింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ జక్కన్న నార్త్ ఇండియాలో ప్లాన్ చేశారట. పూణే మరియు మరికొన్ని ప్రాంతాలలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరుపోకోనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ ఉంటుందట. నిజానికి ఈ షెడ్యూల్ రాజమౌళి ఎప్పుడో పూర్తి చేయాల్సివుండగా చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలు కావడంతో ఆపివేయడం జరిగింది.

రాజమౌళి పాన్ ఇండియా మూవీ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి డి వి సి దానయ్య నిర్మాత కాగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More