ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్-ఒలీవియా సాంగ్ అధ్బుతమట.

Published on May 29, 2020 9:18 am IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్ వన్దర్ ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, చరణ్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. రాజమౌళి మదిలో ఈ చిత్రంపై అధ్బుత ఆలోచనలను ఉన్నాయి. అందుకే లేటైనా పరవాలేదు బెస్ట్ అవుట్ ఫుట్ తో రావాలని ఆయన గట్టి సంకల్పంతో ఉన్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ జోడిగా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కోసం ఏరి కోరి ఆమెను ఎంపిక చేశారు రాజమౌళి.

ఇక వీరిద్దరి మధ్య ఓ అధ్బుతమైన సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట. 1920ల నాటి వెస్ట్రన్ అండ్ ఇండియన్ స్టైల్ లో సాగే ఈ సాంగ్ లో వీరిద్దరి స్టెప్స్ సరికొత్తగా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయట. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ మరియు ఒలీవియా కెమిస్ట్రీ కూడా ఆహ్లాదంగా ఉంటుదని వినికిడి. ఈ సాంగ్ కోరియోగ్రఫీ బాధ్యతలు కూడా విదేశి కొరియోగ్రాఫర్స్ చే చేయించనున్నాడట రాజమౌళి.

సంబంధిత సమాచారం :

More