‘విరాటపర్వం’కు హాలీవుడ్‌ కష్టాలు ?

‘విరాటపర్వం’కు హాలీవుడ్‌ కష్టాలు ?

Published on May 25, 2020 8:07 PM IST

రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ ఈ ‘విరాటపర్వం’ కోసం కొంత‌మంది హాలీవుడ్‌ టెక్నీషియ‌న్లు, ఆర్టిస్టులు తీసుకున్నాడు. హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. అలాగే హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్‌-లోపెజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

మరి ఇప్పుడు కరోనా కాలంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోవడంతో ఈ హాలీవుడ్‌ టెక్నీషియ‌న్లు ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కోసం ఎలా వస్తారో.. మొత్తానికి కరోనా విరాటపర్వానికి హాలీవుడ్ కష్టాలను తెచ్చింది. ఇక తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను దర్శకుడు రాసుకున్నాడట. అంటే అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారనుకుంటా.

ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ సినిమాని డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు