ఇంట్రెస్టింగ్ : విజయ్ ఓకే … ఇక పవన్, వరుణ్ వంతు

ఇంట్రెస్టింగ్ : విజయ్ ఓకే … ఇక పవన్, వరుణ్ వంతు

Published on Apr 25, 2024 2:00 AM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి మూవీ 2016 లో రిలీజ్ అయి అప్పట్లో మంచి విజయం అందుకుంది. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో హరీష్ శంకర్, అలానే హిందీలో వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ టైటిల్ తో కలీస్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రెండు సినిమాల నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని ఆ మూవీస్ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి.

ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు బేబీ జాన్ కూడా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూవీస్ కూడా భారీ తారాగణం, వ్యయంతో రూపొందుతున్నాయి. మరి తేరితో విజయ్ హిట్ కొట్టారు, అలానే రానున్న ఈ రెండు మూవీస్ తో పవన్, వరుణ్ ఏ స్థాయి సక్సెస్ లు సొంతం చేసుకుంటారో చూడాలని అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు