
శంకర్, రజనీకాంత్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొంది సౌత్ ఇండియాలో ఓ ట్రెండ్ సెట్ చేసిన గ్రాఫికల్ వండర్ ‘రోబో’. 2010లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా మార్కెట్ ఏ స్థాయిదో తెలియజేయడమే కాక, టెక్నికల్‌గా ఇండియన్ సినిమా స్థాయిని చూపెట్టింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ తీయాలన్న ఆలోచనను శంకర్ ఎప్పట్నుంచో ప్రస్తావిస్తూ ఉండగా, ఇప్పటికి ఆ ఆలోచన సినిమాగా మారే సమయం వచ్చింది. ఇప్పటికే ‘రోబో 2’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాశారు.
ఇండియన్ సినిమాలో విజువల్ వండర్స్‌లో ఒకటిగా ‘రోబో 2’ ఉండేలా శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉండాలనే దానిపై ఇప్పట్నుంచే ప్లాన్స్ మొదలుపెట్టేశారు. ఇక ఈ సినిమాకు ఇంటర్నేషనల్ సినిమా అప్పీల్ కూడా తీసుకొచ్చే నేపథ్యంలో ‘రోబో 2’లో విలన్ పాత్రకు ఓ ప్రముఖ హాలీవుడ్ నటుణ్ణి ఎంపిక చేయాలని శంకర్ భావిస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించిన వివరాలేవీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ ‘కబాలి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యాక ‘రోబో 2’ సెట్స్‌పైకి వెళ్ళనుంది.

