రంగస్థలం లో ఆది పినిశెట్టి గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ !

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది. అలాంటి సినిమాల్లో ‘రంగస్థలం’ ఒకటి. సుకుమార్ రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు అన్ని అంశాలు ఆకట్టుకున్నాయి.చరణ్, ఆది పినిశెట్టి బ్రదర్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా సమాచారం మేరకు హీరోయిన్ పూజా పొన్నాడ ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో కనిపించబోతోందని సమాచారం. వీరిద్దరి మద్య వచ్చే సన్నివేశాలు సినిమాలో సుకుమార్ బాగా చూపించడం జరిగిందని తెలుస్తోంది. గ్రామిణ నేపద్యంలో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, రత్నవేలు సినిమాటోగ్రఫి సినిమాకు బలం కాబోతున్నాయి.