
రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) ను నవంబర్ 11న ఉదయం 11 గంటలకు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం గురించి ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడానికి రాజమౌళి మరో స్పెషల్ డేట్ ను ఎంచుకున్నారని సమాచారం. డిసెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు (12-12-12) ఈ చిత్రానికి సంబందించి ఒక కీలక ప్రకటన చేయనున్నారట. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.
ఇక ప్రస్తుతం ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ను ప్రముఖ స్టూడియో లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.