ఇంటర్వ్యూ : హీరో సూర్య తేజ ఏలే – “భరతనాట్యం” అందరూ ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్

ఇంటర్వ్యూ : హీరో సూర్య తేజ ఏలే – “భరతనాట్యం” అందరూ ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్

Published on Apr 3, 2024 5:33 PM IST

యువ నటుడు సూర్య తేజ ఏలే హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్న డెబ్యు మూవీ “భరతనాట్యం”. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మరి తాను ఎలాంటి అంశాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

హీరో కావాలి అనే కోరిక ఎప్పుడు ఎలా మొదలైయింది?

నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తివుండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం, నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో వున్న సమయంలో హితేష్ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. ఈ సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తే బావుంటుంది కోరాను. కథ నచ్చి అంగీకరించారు. కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది. అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు రావడంతో సినిమా స్కేల్ మరింత గా పెరిగింది.

దర్శకుడిగా కెవిఆర్ మహేంద్ర గారికే ఈ కథ చెప్పడానికి కారణం?

కెవిఆర్ మహేంద్ర గారితో పరిచయం వుంది. నేను ఆయనకు ఒక డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ఇచ్చాను. అది ఆయనకు నచ్చింది. అప్పటికే ఆయన క్రైమ్ జోనర్ లో ఓ కథ అనుకుంటున్నారు. ఈ కథ ఆయనకు నచ్చుతుందనే నమ్మకంతో చెప్పాను. నా నమ్మకం నిజమైయింది. ఆయనకి నచ్చింది. కెవిఆర్ మహేంద్ర గారు చాలా క్లోజ్ గా వుంటారు. చాలా కామ్ గా వుంటారు. చాలా ఫ్రీడం ఇస్తారు. ఐడియాలని చాలా స్వేఛ్చగా షేర్ చేసుకుంటారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.

మీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పండి?

మా నాన్న గారు (ధని ఏలే) సినీ పరిశ్రమలో పాతికేళ్ళుగా పబ్లిసిటీ డిజైనర్ గా పని చేస్తున్నారు. నేను పెయిటింగ్ లో ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేశాను. సినిమా టైటిల్స్ రాస్తుంటాను. డిజైనింగ్, ఎడిటింగ్ లో అనుభవం వుంది. కోవిడ్ తర్వాత రైటింగ్ లోకి వచ్చాను.

హీరోయిన్ కోసం చెప్పండి?

ఇది లవ్ స్టొరీ కాదు. అన్ని పాత్రలు సమానంగా వుంటాయి. హీరోయిన్ పాత్ర మాత్రం కథలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సినిమాకి మీరు కాకుండా ఈ సినిమాలో హీరోగా ఎవరు బావుంటారు?

శ్రీవిష్ణు గారు, సందీప్ కిషన్ గారైతే బావుంటారు.

మీ నిర్మాతల గురించి చెప్పండి?

హితేష్ గారు ముందు నన్ను మనిషిగా నమ్మారు. కథ విని సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. హితేష్, పాయల్ గారు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఎక్కడా రాజీపడకుండా మంచి ప్యాడింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. ఒక చిన్న సినిమాకి ఈ స్థాయిలో పబ్లిసిటీ జరుగుతుందంటే అది నిర్మాత ప్రోత్సాహంతోనే సాధ్యపడుతుంది.

ఇక ఫైనల్ గా భవిష్యత్ లో రచయితగా కొనసాగుతారా నటుడిగానా?

సినిమాల్లో ఉందామని అనుకుంటున్నాను. అది ఎలా అయినా పర్లేదు. రచయితగా కొన్ని కథలు వున్నాయి. ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది. చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ నా తదుపరి సినిమాకి హెల్ప్ అవుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు