ఇంటర్వ్యూ : భవాని శంకర్ – “క్లైమాక్స్” టైటిల్ అందుకే పెట్టాం..

ఇంటర్వ్యూ : భవాని శంకర్ – “క్లైమాక్స్” టైటిల్ అందుకే పెట్టాం..

Published on Mar 3, 2021 2:00 PM IST

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఒక్క కామెడీ రోల్స్ లోనే కాకుండా కొన్ని బెంచ్ మార్క్ రోల్స్ లో కూడా చేశారు. మరి వాటిలానే కాకపోతే కాస్త వాటికీ భిన్నంగా చేసిన లేటెస్ట్ చిత్రం “క్లైమాక్స్”. ఇందులో తన గెటప్ నుంచి తాను ఓ ర్యాప్ సాంగ్ కు పెట్టిన ఎఫర్ట్స్ వరకు ఈ సినిమాపై మంచి బజ్ ను తీసుకొచ్చాయి. అయితే మరి ఈ డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు భవాని శంకర్ తో ఇపుడు ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఇందులో తాను ఎలాంటి విషయాలను వెల్లడించారో చూద్దాం.

 

ఈ సినిమాకు “క్లైమాక్స్” అనే టైటిల్ ను ఎందుకు పెట్టారు?

ఈ టైటిల్ కు తగ్గట్టే సినిమా మొత్తం రివీల్ అయ్యేది క్లైమాక్స్ లోనే కాబట్టి ఈ టైటిల్ ను పెట్టాం. రాజేంద్ర ప్రసాద్ గారు, శివశంకర్ మాస్టర్, శ్రీ రెడ్డి, పృద్వి ఇలా అందరూ ఓకే ఫ్రేమ్ లో అటు ఇటు ఎందుకున్నారంటే వాళ్ళు సస్పెక్ట్స్ లా ఈ మర్డర్ మిస్టరీలో కనిపిస్తారు అందుకే అలా సెట్ చేసాం.

 

సినిమా అంతా కామెడీ గానే ఉంటుందా.?

సినిమా అంతా హిలేరియస్ గా ఉంటుంది. అలాగే అన్ని టెన్షన్స్ కూడా ఉంటాయి. కానీ ఎక్కడా కూడా సీరియస్ గా వెళ్ళలేదు.ఇబ్బంది పెట్టే మర్డర్స్ లేకుండా తీసాం అందుకే యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సో ఎక్కడా వైలెన్స్ లేకుండా ఈ మిస్టరీని తీసాం.

 

మరి మోడీ అనే పేరు ఎందుకు పెట్టారు అని అడిగితే.?

అది ఇప్పుడే చెప్పేస్తే బాగోదు అండి, అదంతా క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుంది. అప్పుడు ప్రతీ ఒక్కరికీ నేను ఎందుకు మోడీ పేరు ప్రతీ ఒక్కరికీ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం వందకి నూటొక్క శాతం కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. ముందు ట్రైలర్ వచ్చినపుడు కూడా మోడీ పేరు వస్తే సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు అన్నారు కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా ఏమీ అనలేదు వాళ్ళకి అర్ధం అయ్యిపోయింది.

 

ట్రైలర్ లో చాలా డబ్బు చూపించారు ఏమన్నా స్కాం లా ఉంటుందా.?

అవునండి, ఒక మల్టీ మిలీనియర్ తనకి ఫ్యామిలీ ఉన్నప్పటికీ ఒక హోటల్ లోనే ఉండిపోతాడు. కానీ అక్కడే 500కోట్లు కూడా ఉంటుంది తర్వాత అతను చచ్చిపోతాడు డబ్బు కనిపించదు మరి అదే లాస్ట్ కి ఏమయ్యింది అన్నది తెలుస్తుంది.

 

రాజేంద్ర ప్రసాద్ గారికి గెటప్స్ ఎక్కువే ఉన్నట్టు ఉన్నాయ్?

ఇందులో ఆయనది ఒకే గెటప్ అండి మొత్తం ఒకేలా కనిపిస్తారు. కానీ ఇంతకు ముందు మేము చేసిన డ్రీమ్స్ లో మాత్రం నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించారు. మీకు గుర్తుందో లేదో ఆ సినిమాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇందులో మాత్రం ఆయన ఒకే గెటప్ లో ఉంటారు.

 

రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే ఈ సినిమా రాశారా లేక?

లేదండి ముందు నేను స్టోరీ రాసుకున్నపుడు ఒకరిని దృష్టిలో పెట్టుకొని రాయను, రాసాక ఎవరు అయితే బాగుంటారు అని అనుకుంటా. అలా దీనికి ముందు మోహన్ బాబు గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నా, అంటే ఆ ఏజ్ రోల్ కు వాళ్ళు కరెక్ట్ అనిపించింది. అయితే రీచ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎక్కువుంది అందుకే వెళ్ళాం టక్కున చేసేసాం.

 

శ్రీ రెడ్డిని తీసుకోడానికి కారణం ఏంటి?

నేను ముందుగా ఏం ఆలోచించలేదు పెట్టేసిన తర్వాత అప్పుడు తెలిసింది నేను యూఎస్ లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ కాంట్రవర్సీలు అయ్యాయి అని, కానీ ఈ సినిమాలో తనకి చిన్న రోల్ నే ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఇంకో సినిమా తీస్తారు అందులో ఆమెతో తీస్తారు దానికి అనుకున్న కథ ప్రకారం ఆమెను సెలెక్ట్ చెయ్యాలి అందుకే తీసుకున్నాం.

 

డ్రీమ్స్ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది?

ఆ సినిమా సక్సెస్ తర్వాత గ్రీక్ లో ఒక సినిమా చెయ్యడానికి ఛాన్స్ వచ్చింది. అక్కడ గ్రీక్ ఫిల్మ్ సెంటర్ అని వాళ్ళే కొంతమంది అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్స్ తో చెయ్యడానికి ముందుకొచ్చారు కానీ ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. దీనితో అక్కడే నాకు మూడేళ్లు పోయింది.

 

ఇప్పుడు ప్రతీ వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎలా అనిపిస్తుంది?

అవునండి ఈ వచ్చే వారం కూడా పద్నాలుగు సినిమాలు ఉన్నాయ్. కానీ ఆగుదాం అంటే ఒక్కొక్కలు ఒక్కో భయం పెట్టారు. లేట్ అయితే ఎక్కడా ఛాన్స్ లేదు సో రావాల్సిందే అని ఇప్పుడు తీసుకొస్తున్నా..

 

మరి ఓటిటి ఆఫర్స్ ఏమన్నా వచ్చాయా.?

వచ్చాయి లాస్ట్ జూన్ లో నెట్ ఫ్లిక్స్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది కానీ అప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉండడం నేను కూడా యూఎస్ లో ఉండిపోవడం వల్ల ఏం కాలేదు. కానీ ఓటిటిలో అయితే ఈ సినిమాకు ఇంకా మంచి ఆఫరే వస్తుంది అనుకుంటున్నాం ఇంకా ఎం చెయ్యలేదు.

 

సాషా సింగ్ రోల్ ఏంటి?

ఇందులో ఆమె మెయిన్ లీడ్ తో ఒక రాత్రి ఉంటే కోటి రూపాయలు తీసుకునే అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాతే మర్డర్ జరగడంతో మొత్తం అంతా ఆమెపై షిఫ్ట్ అవుతుంది అంటే ఒక ఉమనైజర్ లా కనిపిస్తుంది. అందులో తాను బాగా చేసింది.

 

ఫైనల్ గా సినిమా కోసం ఏం చెప్తారు.?

నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఒకటిన్నర గంట మాత్రమే ఉండే ఈ సినిమా అందరూ చూడాలి అనుకుంటున్నా. ఎందుకంటే ముందే చెప్పినట్టుగా ఇందులో ఉండే షాట్స్ కానీ డైలాగ్స్ కానీ ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా ఉన్నట్టు ఉండవు అలా రాసుకున్నా. అలాగే ప్రతీ ఒక్కరికీ పైసా వసూల్ అనే సినిమాలా అనిపిస్తుంది. అంతే కాకుండా క్లైమాక్స్ చూసి ప్రతీ ఒక్కరు కూడా థ్రిల్ అవుతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు