ఇంటర్వ్యూ: నవదీప్- నేను అలాంటివాడిని కాదు, మీడియా అలా ప్రొజెక్ట్ చేసింది..!

Published on Apr 24, 2020 1:19 pm IST

2004లో టాలెంటెడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన జై సినిమాలతో హీరోగా వెండితెరకు పరిచమైన నవదీప్ తెలుగుతో పాటు తమిళ భాషలలో హీరోగా చేశారు. దాదాపు పరిశ్రమలో 16ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన నటుడిగా అనేక రకాల పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆయన అనేక వెబ్ సిరీస్ లో కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ లాక్ డౌన్ సిరీస్ లో మన నెక్స్ట్ గెస్ట్ గా నవదీప్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

లాక్ డౌన్ లో మీ దిన చర్య ఏమిటీ?

వ్యాయామంతో నా డే స్టార్ట్ అవుతుంది. తరువాత ఫోన్ లో స్క్రిప్ట్ డిస్కషన్స్ తో పాటు నా చిత్రాల దర్శక నిర్మాతలతో మాట్లాడతాను. ఈ మధ్య మలయాళం సినిమాలు ఎక్కువగా చూస్తున్నాను. ట్రేస్, డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాలు చాలా బాగున్నాయి, వాటిని మిస్సవొద్దు అని నా సలహా.

ప్రస్తుతం మీరు చేస్తన్న ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

మస్తీ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ మొదలైంది. ఇక ఏ ఎల్ టి బాలాజీ లో నేను రామాయణ అనే ఓ హిందీ ఫీచర్ ఫిలిం చేశాను అది కూడా విడుదలైంది. తమిళంలో ఓ చిత్రం చేస్తున్నా, తెలుగులో రెండు చిత్రాలకు సైన్ చేశాను. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్లు మూవీలో విలన్ రోల్ చేస్తున్నాను.

మీ కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నారా?

గతంలో కొంచెం అసంతృప్తి ఉండేది. ఐతే గత ఏడాదిగా నా కెరీర్ ట్రాక్ లో పడింది. ప్రస్తుతం నా కెరీర్ ఉన్నత స్థితిలో ఉందని భావిస్తున్నాను. ఇకపై తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటే లాంగ్ కెరీర్ ఉంటుందనిపిస్తుంది.

పరిశ్రమలలో మీకు బ్యాడ్ ఇమేజ్ ఉంది, దానికి మీ సమాధానం?

నేను అందరూ అనుకుంటున్నట్లు చెడ్డవాడిని కాదు. గతంలో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వలన కొన్ని సమస్యలలో ఇరుకున్నాను. మీడియా దానిని తారా స్థాయికి తీసుకెళ్లింది. బిగ్ బాస్ తరువాత నేనేమిటో అందరికీ అర్థం అయ్యింది.

సి స్పేస్ ఎలా వర్క్ అవుతుంది?

సి స్పేస్ విషయంలో చాల సంతృప్తి కరంగా ఉన్నాను. సినిమా షూటింగ్స్ లేకపోతే అక్కడే ఉంటాను నేను. త్వరలో రెండు చిత్రాలు సి స్పేస్ లో నిర్మించబోతున్నాము

ఇంకెన్నాళ్లు బ్యాచిలర్ గా ఉంటారు?

ప్రస్తతానికి పెళ్లి ఆలోచనలు లేవు, ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నాడు. ఆర్థికంగా సెటిల్ అయినాక పెళ్లి గురించి ఆలోచిస్తాను.

టాలీవుడ్ లో ఏ దర్శకుడితో పనిచేయాలని ఆశపడుతున్నారు?

చిన్నప్పటి నుండి చిరంజీవి మాస్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక నాకు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పని చేయాలని ఉంది. ఆయన నన్ను వెండితెరపై బాగా చూపించగలరని నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More