ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: రామ్ గోపాల్ వర్మ- క్లైమాక్స్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ లా ఉంటుంది.

Published on Jun 6, 2020 3:11 pm IST

లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ లో నేడు సంచల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన క్లైమాక్స్ మూవీ మరియు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వంటి అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ సంగతులేమిటో చూద్దాం..

 

మీ సినిమాల విడుదల సమయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు?

నా సినిమా విడుదల దాని ఫలితం నాకు ఎలాంటి ఎక్సయిట్మెంట్ కాని టెన్షన్ కాని కలిగించవు. కేవలం స్క్రిప్ట్ రాసేటప్పుడు మాత్రమే నేను ఎక్సయిట్ ఫీలవుతాను.

 

మీ సినిమాల పై వచ్చిన రివ్యూలు చదువుతారా?

నా సినిమాల గురించి క్రిటిక్స్ ఏమి అనుకుంటున్నారో తెలిసుకోవాలన్న, ఆసక్తినాకు ఉండదు. కొందరు సన్నిహితులు ఒక సారి లింక్స్ పంపితే చదివాను. ఐతే నా సినిమాను వారు రిసీవ్ చేసుకున్న దానికి, నేను అనుకున్న దానికి సంబంధం లేకుండా రివ్యూ ఉంది. అప్పటి నుండే రివ్యూస్ పట్టించుకోకూడదు అని డిసైడ్ అయ్యాను.

 

క్లైమాక్స్ గురించి చెప్పండి?

క్లైమాక్స్ ప్రేక్షకులకు అద్భుతమైనా అనుభూతిని ఇస్తుంది. సాధారణంగా హారర్ మూవీలు డార్క్ షేడ్ సెటప్ లో తెరకెక్కిస్తారు. కానీ నేను భిన్నంగా ఓ ఎడారిలో తెరకెక్కించాను. యూఎస్ కి చెందిన ఓ యుంగ్ కపుల్ నిర్మానుష్యమైన ఎడారిలో విహారానికి వచ్చి ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.

 

మీరు కనీసం సెట్స్ కి కూడా వెళ్లరని చెప్పారు. అదెలా సాధ్యం?

నేడు అత్యాధునిక సాంకేతిక అందుబాటులో ఉంది. ఈరోజుల్లో సినిమా తీయాలంటే సెట్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. కరణ్ జోహార్ సెట్స్ కి వెళ్లకుండానే అనేక చిత్రాలు నిర్మిస్తూ ఉంటారు. నేను కూడా అంతే. భవిష్యత్ లో సినిమా మేకింగ్ ఇలానే ఉంటుంది.

 

భవిష్యత్ లో థియేటర్స్ మనుగ ఉండదని భావిస్తున్నారా?

 

అలా ఎప్పటికీ జరగదు. పెద్ద చిత్రాలన్నీ థియేటర్స్ లోనే విడుదల అవుతాయి. చిన్న చిత్రాలకు మాత్రం ఓ టి టి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నాకు తెలిసి భవిష్యత్ లో 80శాతం చిత్రాలు ఓ టి టి లోనే విడుదల అవుతాయి.

 

ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన సినిమా లేదా నటుడు ఎవరైనా ఉన్నారా?

వెండి తెరపై మనస్ఫూర్తిగా సినిమా చూసి పదేళ్లు అవుతుంది. ఇతరులు ఏమి చేస్తున్నారు, ఎలాంటి సినిమాలు తీస్తున్నారు అనే విషయాలు నేను పట్టించుకోను. ఇతరుల వర్క్ నుండి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందను.

 

మీ లైఫ్ స్టైల్, ఫిలాసఫీ కి చాల మంది అభిమానులు ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది?

 

ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది నేను ఎప్పుడూ పట్టించుకోను. నాకు ఇష్టం వచ్చిన నట్లు ఉంటాను. అలాగే నేను చాల స్వార్థపరుడుని.

 

మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటీ?

నేను గాడ్సే మూవీ తీయాలనుకుంటున్నాను. అలాగే కడప గురించి ఓ చిత్రం తెరకెక్కిస్తాను. ఓ హిందీ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కించే ప్రణాళిక ఉంది. అలాగే కరోనా వైరస్ పై కూడా నా మూవీ ఉంటుంది.

సంబంధిత సమాచారం :

More