ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ: అడివి శేష్- మహేష్ అంతటి స్టార్ అభినందించడంతో సంతోషం వేసింది.

Published on Apr 18, 2020 11:49 pm IST

వినూత్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకెళుతున్నారు యంగ్ హీరో అడివి శేషు. అయన నటించిన క్షణం, గూఢచారి, ఎవరు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం మహేష్ నిర్మాతగా మేజర్ అనే బయో పిక్ చేస్తున్న అడివి శేషుతో 123తెలుగు.కామ్ ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ మీకోసం..

 

లాక్ డౌన్ కాలంలో మీ పరిస్థితి ఏమిటీ?

ఏళ్ళ తరబడి బ్రతిమిలాడితే పేరెంట్స్ నాతో పాటు ఇండియాలో ఉండడానికి ఒప్పుకున్నారు. నాన్నా నాతో ఉన్నారు, అమ్మ సిస్టర్ ని చూడడానికి ఐర్లాండ్ వెళ్లి అక్కడే లాక్ డౌన్ కారణంగా ఇరుక్కుపోయారు. నేనైతే గూఢచారి 2 స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను.

 

మరి గూఢచారి 2 విశేషాలేమిటో చెప్పండి?

గూఢచారి 2 సినిమా కోసం స్క్రిప్ట్ నేనే స్వయంగా సిద్ధం చేస్తున్నాను. స్క్రిప్ట్ చాలా బాగా వస్తుంది. మేజర్ తరువాత ఈ మూవీని తెరకెక్కించి విడుదల చేయాలనే ప్రణాళిక ఉంది.

 

మేజర్ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది?

లాక్ డౌన్ ముందు వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపాం. దాదాపు 40% షూటింగ్ పూర్తయింది. హిందీ మరియు తెలుగులో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నాము. మేజర్ నా ఫస్ట్ హిందీ చిత్రంగా బాలీవుడ్ లో విడుదల కానుంది. 26/11 అటాక్స్ లో ప్రాణాలు అర్పించిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ కావడంతో నా పై చాలా బాధ్యత ఉంది.

 

మేజర్ సినిమాకు మహేష్ సహ నిర్మాతగా ఉన్నారు కదా, ఆయన సహకారం ఎలా ఉంది?

మహేష్ గారిని నేను చాలా తక్కువ సార్లు కలిశాను. ఐతే మేజర్ టీం ఇస్తున్న అవుట్ ఫుట్ ఆయనకు బాగా నచ్చిందట. మేజర్ టీం ని ఆయన అభినందించం కూడా జరిగింది. అంత పెద్ద స్టార్ మా టీం ని అభినందించడంతో పట్టలేనంత సంతోషం వేసింది.

 

హిందీలో ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది, సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

సబ్జెక్టు రీత్యా ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక సందీప్ ఉన్నికృష్ణన్ బయో పిక్ తీయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసం వారి తల్లిదండ్రులను కలవడం జరిగింది. నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాను .

 

శశి కిరణ్ తిక్క డైరెక్టర్ అయినప్పటికీ, వెనకుండి నడిపించేది మీరేనట కదా?

అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. శశి కిరణ్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఆయనకు చాల పెద్ద అవకాశాలు వచ్చినా నా వర్క్ కి సింక్ అవుతాడని తీసుకు రావడం జరిగింది.

 

ఎప్పుడూ కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తున్నారు? కమర్షియల్ మూవీస్ చేయరా?

ఎందుకు చేయను. పాత్రలో విషయం ఉంటే కమర్షియల్ మూవీస్ చేయడానికీ నేనిప్పుడు సిద్దమే. ఐతే ఫ్యాన్స్ ని పెంచుకోవడానికి డాన్స్ లు, ఫైట్ లు నేను చేయను. మీనింగ్ ఫుల్ పాత్ర దొరికితే కమర్షియల్ మూవీస్ చేస్తాను.

 

అప్పుడప్పుడు మీకు అఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి, వాటిలో నిజం ఎంత?

అవి వట్టి పుకార్లు మాత్రమే.. అవి చదివినప్పుడు నేను నవ్వుకొని వదిలేస్తాను. పెద్దగా వాటిని పట్టించుకోను. ప్రస్తుతానికి నా స్టేటస్ సింగిల్.

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటీ?

ముందుగా మీకు చెప్పినట్లే మేజర్ అండ్ గూఢచారి 2 చిత్రాల గురించి ఆలోచిస్తున్నాను. ఈ రెండు చిత్రాలు విడుదలైన తరువాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం :