ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: సుశాంత్- వర్సిటైల్ యాక్టర్ గా ఎదగాలనుకుంటున్నా..!

Published on Apr 29, 2020 1:17 pm IST

2008లో వచ్చిన కాళిదాసు మూవీతో వెండితెరకు పరిచమయ్యాడు హీరో సుశాంత్. అక్కినేని వారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో కరెంట్, చిలసౌ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో మూవీలో కీలక రోల్ చేసిన సుశాంత్ కెరీర్ ప్లాన్స్, అప్ అండ్ డౌన్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించిన అనేక విషయాలు అడిగితెలుసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీ కోసం.

 

లాక్ డౌన్ టైం లో ఎలా గడుపుతున్నారు?

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఇంట్లో ఉంటున్నాను. ఇద్దరు సిస్టర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వారి జాబ్ పూర్తయే వరకు నా వ్యాపకంలో నేనుంటాను. వారి వర్క్ అయిపోయిన వెంటనే అందరం కలిసి టీవీ చూస్తాం. కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు ఎక్కవగా చూస్తున్నాం.

 

చిలసౌ మూవీ మీపై ఎలాంటి ప్రభావం చూపింది?

ఆ మూవీ నాలో కొంత రియలైజేషన్ తీసుకువచ్చింది. అన్ని విషయాలలో ఒకరిపై ఆధార పడకూడదు, కొన్ని నిర్ణయాలు మనం స్వయంగా తీసుకోవాలనే ఆలోచన వచ్చేలా చేసింది.

 

చిలసౌ మూవీ ఎలా కుదిరింది?
నాగ చైతన్య ఎంగేజ్మెంట్ సమయంలో రాహుల్ రవీంద్ర నాకు చిలసౌ స్టోరీ చెప్పారు. ఎందుకో ఈ కథ నాకు బాగా సెట్ అవుతుంది అనుకున్నాను, అందుకే వెంటనే ఒకే చెప్పేశాను. ఈ మూవీలో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా సక్సెస్ అవుతుందని నమ్మాను.. అదే జరిగింది.

 

మీ జడ్జిమెంట్ పై నమ్మకంతోనేనా అల వైకుంఠపురంలో మూవీ ఒప్పుకున్నారు?

అవును..హీరోగా సినిమాలు చేస్తున్న నేను ఆ ప్యాట్రన్ బ్రేక్ చేద్దాం అని అల వైకుంఠపురంలో ఆ పాత్రకు ఒప్పుకోవడం జరిగింది. దానితో పాటు త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో వర్క్ చేసే అవకాశం వదులుకోవాలని అనిపించలేదు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో నాకు కూడా గుర్తింపు వచ్చింది. అందుకే స్ప్రైట్ యాడ్ లో నటించే అవకాశం దక్కింది. నేను స్వతంత్రంగా తీసుకున్న ఆ నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చినట్టే లెక్క.

 

మీ కెరీర్ లో అనేక జయాపజయాలు ఉన్నాయి, నాగార్జునగారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది?

నా కెరీర్ బిగినింగ్ నుండి నాగార్జున గారు సపోర్ట్ గా ఉన్నారు.. భవిష్యత్తులో కూడా ఉంటారు. నేను చిలసౌ మూవీ చేసిన సంగతి ఆయనకు తెలియదు. ఆ మూవీ ఫస్ట్ కాపీ చూసిన తరువాత చాల ఇంప్రెస్ అయ్యారు. ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు.

 

మొదట్నుండి హీరో అవ్వాలని అనుకున్నారా?

లేదు. యూఎస్ లో చదువు పూర్తి చేశాక.. అక్కడే చాలా కాలం వివిధ సంస్థలలో పనిచేశాను. ఆ సమయంలోనే యాక్టింగ్ చేయాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. ఆ ఆలోచనలు క్రమంగా పెరిగిపోవడంతో ఇండియా వచ్చేసి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను.

 

ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ గురించి చెప్పండి?

ఈ సినిమా నేను అల వైకుంఠపురంలో మూవీకి ముందే సైన్ చేయడం జరిగింది. ఐతే షూటింగ్ మాత్రం ఈ మధ్యనే మొదలైంది. ఈ మూవీ కామెడీ, రొమాన్స్, థ్రిల్స్ కలిగిన ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్.

 

చైతూ, అఖిల్ మరియు సుమంత్ తో మీ రేలషన్ ఎలా ఉంటుంది?

సుమంత్ అన్నతో చిన్నప్పటి నుండి అనుభందం ఎక్కువ. ఇక కుటుంబంలోని కజిన్స్ అందరం చాలా క్లోజ్ గా ఉంటాము. మా ప్రాజెక్ట్స్ వాటి రిజల్ట్స్ అనేక విషయాలు కలిసినప్పుడల్లా చర్చించుకుంటాం.

 

వ్యక్తిగతంగా మీ స్వభావం ఎలాంటిది?

ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతాను అలా అని బయట తిరగను, ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడైనా అరుదుగా ఫ్రెండ్స్ తో పార్టీలలో పాల్గొంటాను.ఇక డిజర్ట్స్ ,ఇండియన్ చైనీస్ వంటకాలను ఇష్టపడతాను. క్రికెట్ చూడడం, ఆడడం ఇష్టమైన వ్యాపకం. పెయింటింగ్ కూడా నా హాబీగా ఉంది.

 

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటీ?

ఏడాది కాలంగా నా కెరీర్ ఓ కొత్త మలుపు తీసుకుంది. దీనిని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో ఓ వర్సిటైల్ యాక్టర్ గా ఎదగాలనుకుంటున్నాను. చిత్ర పరిశ్రమలో నటుడిగా నాకు ఎప్పుడూ స్థానం ఉంటుందని భావిస్తున్నాను.

సంబంధిత సమాచారం :

X
More