ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ప్రణీత సుభాష్-ఎన్టీఆర్ అరుదైన నటుడు.. !

Published on May 5, 2020 9:53 pm IST

లాక్ డౌన్ రివ్యూలో మన నెక్స్ట్ గెస్ట్ ప్రణీత సుభాష్. లాక్ డౌన్ సమయంలో పేదల కొరకు ఆమె చేస్తున్న సేవలు మంచి ప్రాచుర్యం పొందాయి. ఇక ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రస్తుత ప్రాజెక్ట్స్,
బాలీవుడ్ ఎంట్రీ వంటి అనేక విషయాలు అడిగి తెలుకోవడం జరిగింది…

మీలో చాలా సేవా గుణం ఉంది. అది ఎవరికీ తెలియదు?
నా సోషల్ సర్వీస్ ఎవరో గుర్తించాలని కోరుకోను. మా అమ్మ నాన్న డాక్టర్స్ కావడం వలన ఎప్పుడో రెండు స్కూల్స్ దత్త తీసుకోవడం జరిగింది. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు మా కుటుంబం చేస్తుంది.

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లున్నారు?

అవును అజయ్ దేవ్ గణ్ గారితో ఒక చిత్రం, ప్రియదర్శన్ డైరెక్షన్ లో మరొక చిత్రం చేస్తున్నాను. ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుకుంటున్నాయి.

తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు?
నిజానికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఐతే అవేమి నాకు నచ్చడం లేదు. అందుకే తెలుగులో సినిమాలు చేయడం లేదు.. మంచి రోల్ దొరికితే చేస్తా.

మీరు పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది పెద్ద హిట్, ఆ సక్సెస్ ని మీరు సరిగా ఉపయోగించుకోలేదేమో?

దానికి నేను ఒప్పుకోను…ఆ సినిమా తరువాత నేను కన్నడ మరియు తమిళ్ లో చాలా అవకాశాలు పొందాను. ఇప్పటికీ చాలా బిజీ హీరోయిన్ గా ఉన్నాను.

పవన్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది?
ఆయన్ని కలిసి చాలా రోజులు అవుతుంది. సెట్స్ లో ఆయన… నేను లైఫ్ గురించి అనేక విషయాలు మాట్లాడుకునేవారం.ఆయనలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. ఆయనతో మళ్ళీ నటించే అవకాశం వస్తే బాగుండు.

మీరు ఎన్టీఆర్ తో కూడా నటించారు.. ఆయన గురించి మీ అభిప్రాయం?

ఎన్టీఆర్ ఓ గొప్ప నటుడు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. రేర్ ఆర్టిస్ట్స్ లో ఆయన ఒకరు.

పెళ్లి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా..?
బాలీవుడ్ లో కెరీర్ ఇప్పుడే మొదలుపెట్టాను… అక్కడ సక్సెస్ కావడానికి ప్రయత్నించాలి. ఇక పెళ్లి అంటారా దానికి ఇంకా కొంచెం సమయం ఉంది.

మీకు స్ఫూర్తిని ఇచ్చిన హీరోయిన్ ఎవరు?
అలియా భట్ తన కెరీర్ ని మలచుకున్న తీరు బాగా నచ్చుతుంది. అలాగే దీపికా పదుకొనె అంటే చాలా ఇష్టం.

 

సంబంధిత సమాచారం :