ఇంటర్వ్యూ: సోనాల్ చౌహాన్- అలాంటి రూమర్స్ పట్టించుకోను..!

ఇంటర్వ్యూ: సోనాల్ చౌహాన్- అలాంటి రూమర్స్ పట్టించుకోను..!

Published on Dec 17, 2019 5:02 PM IST

నటసింహ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ రూలర్. సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 20న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది. బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తుండగా వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంకా మూడు రోజులలో విడుదల నేపథ్యంలో సోనాల్ చౌహాన్ పాత్రికేయులతో ముచ్చటించారు.

 

బాలయ్య గారితో ఇది మూడో సినిమా.., ఎలా ఉంది ఆయనతో జర్నీ?

బాలకృష్ణ గారిని కలవక ముందు ఆయనంటే కొంచెం భయం ఉండేది. కానీ ఆయనతో పరిచయం ఏర్పడ్డాక ఆ భయం అంతా పోయింది. ఆయన సెట్స్ లో చాలా జోవియల్ గా ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయనలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మెచ్చుకోవాల్సిందే. ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది.

 

రూలర్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

ఈ మూవీలో నా పాత్ర పేరు హారిక. ఒక తలబిరుసు కలిగిన అమ్మాయి,తనకు నచ్చింది దక్కించుకునే వరకు వదలదు. నాపాత్రలో గ్లామర్ , ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి

 

ఈ మూవీలో అవకాశం ఎలా దక్కింది ?

దర్శకులు కె ఎస్ రవి కుమార్ గారు ఫోన్ చేసి పిలిపించి మూవీ కథ చెప్పారు. ఆతర్వాత వెంటనే నేను ఒకే చెప్పడం జరిగింది. అప్ కోర్స్ కథ వినకపోయినప్పటికీ ఈ మూవీ వదులుకొనేదానిని కాదు.

 

తెలుగులో ఇంకా ఏమైనా సినిమాలు చేస్తున్నారా?

ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఏమి చెప్పలేను.

 

వెబ్ సిరీస్ లో ఏమైనా నటిస్తున్నారా?

వెబ్ సిరీస్ లో చేయడానికి నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. హిందీలో ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాను.

 

సినిమాపై డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ప్రభావం ఎలా ఉంది?

ఖచ్చితంగా భవిష్యత్తు డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ దే. ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో ఉండే సౌకర్యం వలన ప్రేక్షకులు వీటిని ఇష్టపడుతున్నారు. డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వలన ఎంటర్టైన్మెంట్స్ అనేది మన ఫిగర్ టిప్స్ వరకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ మార్పు స్వాగతించదగినదే.

 

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ ని ఎలా తీసుకుంటారు?

సోషల్ మీడియాలో కామెంట్స్ అనేవి సర్వ సాధారణం. మనకు తెలిసినవారు కామెంట్ చేసినప్పుడు, లేదా మనకు తెలిసిన వారిపై రూమర్స్ క్రియేట్ చేసినప్పుడు నేను స్పందిస్తాను. అంతే కానీ ప్రతి ఒక్కరి కామెంట్స్ కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేమిటో నా పేరెంట్స్ కి తెలుసు అందుకే ఎటువంటి రూమర్స్ ని సీరియస్ గా తీసుకోను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు