ఫీచర్ ఫిలిమ్స్ డైరెక్టర్ మరియు యాక్టర్ గా సుపరిచుతుడైన నగేష్ కుకునూర్ మహానటి యాక్ట్రెస్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. హీరో కమ్ దర్శకుడిగా తన మొదటి ఫిల్మ్ ‘హైదరాబాద్ బ్లూస్’ నిర్మించిన నగేష్ హైదరాబాద్ తో తనకు గల అనుబంధం, అలాగే కీర్తి సురేష్ తో చేస్తున్న మూవీ విశేషాలు పాత్రికేయులతో పంచుకున్నారు.
మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
బేసిక్ గా నేను హైదరాబాదీనే. హైదరాబాద్ ని చాలా ఇష్టపడతాను. కానీ మా డాడీ యూఎస్ లో జాబ్ చేయడం వలన నేను అక్కడే పెరిగాను. సినిమా తీయాలని ఇండియా కి వచ్చినప్పుడు నాకు ఎవరూ తెలియదు. మా డాడీ నిర్మాత, నేను డైరెక్టర్, యాక్టర్. ఇలా కుటంబం మొత్తం కలిసి 1998 లో ‘ హైదరాబాద్ బ్లూస్’ పేరుతో నా మొదటి ఫీచర్ ఫిల్మ్ తీయడం జరిగింది.
మరి ఇన్నేళ్ల కెరీర్ లో మీరు సాధించిన అఛీవ్మెంట్ ఏమిటీ?
నేను 15 వరకు ఫీచర్ ఫిల్మ్స్ తీయడం జరిగింది. అలాగే సిటీ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో చేసిన వెబ్ సిరీస్ ఈ ఏడాది హాట్ స్టార్ లో ప్రసారం ఐయ్యింది. ఐతే ఒక ఫుల్ టైం కమర్షియల్ మూవీ తీయడం పెద్ద అఛీవ్మెంట్ లా భావిస్తాను.
15 ఫీచర్ ఫిలిమ్స్ తీశారు అందులో ఎన్ని విజయం సాధించాయి?
హానెస్ట్ గా చెవుతున్నాను..,నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను తీసిన మూవీ ఫస్ట్ కాపీ చూస్తాను అంతే. తర్వాత మూవీ గురించి నేను పట్టించుకోను. మూవీ రివ్యూస్ కూడా నేను చదవను.
స్టార్ హీరోలెవరైనా మీతో మూవీస్ చేయడానికి ముందుకు వచ్చారా?
ఏ డైరెక్టర్ కైనా కూడా ఏదో ఒక సమయంలో పెద్ద హీరోలతో సినిమాలు చేశే అవకాశం దక్కుతుంది. నేను కూడా పదేళ్ల క్రితం అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాను. ఐతే నేను స్టార్ హీరోలతోనే మూవీస్ చేయాలనుకోను, స్క్రిప్ట్ కి తగ్గట్టుగా క్యాస్టింగ్ ని ఎంచుకుంటాను. స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదని నేను బాధపడలేదు, అందుకోసం నేను పరిగెత్తలేదు.
తెలుగు వారైన మీరు తెలుగులో మూవీ చేయకపోవడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు?
నేను హైదరాబాద్ అబ్బాయినైనా నాకు తెలుగు మాట్లాడగలను గానీ చదవడం రాయడం రాదు. హిందీ మాత్రం నాకు చదవడం రాయడం వచ్చు. నా ఒపీనియన్ లో భాషమీద పట్టు లేకుండా మూవీ చేయకూడదు అనుకున్నాను. ఏదేమైనా కీర్తి మూవీతో ఇప్పటికి కుదిరింది.
కీర్తితో మీరు చేస్తున్న మూవీ ఏ జోనర్ అని చెప్పొచ్చు?
ఇది స్పోర్ట్స్ ఎలిమెంట్స్ తో కూడిన రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆడవాళ్ళ గురించి మంచి సందేశం కూడా ఉంటుంది.
ఈ చిత్రం చేయడానికి మీకు స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా?
రిషికేష్ ముఖర్జీ ,విశ్వనాధ్ గారు ఈ చిత్రం తెరకెక్కించడానికి నాకు స్ఫూర్తి అని చెప్పాలి. ముఖ్యంగా రిషికేష్ ముఖర్జీ గారి సినిమాలను తలపించేలా ఈ మూవీ టేకింగ్ ఉంటుంది.
ఇరవై ఏళ్లలో మీరు ప్రేక్షకులలో గమనించిన మార్పులు ఏమిటీ?
ప్రేక్షకులు ఏమో కానీ నేనే చాలా మారిపోయాను. ఒకప్పుడు నేను చేసిన చిత్రాలు ఇప్పుడు నాకే నచ్చడం లేదు. నేను అప్పుడు అలా ఎందుకు తీశాను అనిపిస్తుంది.
తెలుగు సినిమాలు మీరు ఏవి చూశారు?
నేను కేవలం తెలుగులో మాహానటి చిత్రం చూశాను. అది కూడా యూఎస్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే చూశాను. అప్పుడే ఈ మూవీకి కీర్తిని ఎంపిక చేసుకోవడం జరిగింది.
ఈ మూవీ వికారాబాద్ లో షూట్ చేశారట కారణం?
ముందు గండి కోటలో చిత్రీకరించాలని చూశాం కానీ, వికారాబాద్ దగ్గర గల ఆ గ్రామం చూశాక అక్కడ చేయాలనీ నిర్ణయించాం.
ఆది పాత్ర ఎలా ఉంటుంది?
ఆది ఒక నాటకాల కంపెనీలో పనిచేసే స్టేజ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు. ఇక జగపతి బాబు కోచ్ గా కనిపిస్తారు.
మీకు రిషికేష్ ముఖర్జీ మీ రోల్ మోడల్ అన్నారు, మోడరన్ రిషికేష్ ముఖర్జీ అనిపించుకోవాలనుకుంటున్నారా ?
ఖచ్చితంగా..,గతంలో నాకు ఒకరు ఆ కంప్లీమెంట్ కూడా ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నాకు తెలిసి హిందీలో రిషికేష్ ముఖర్జీ, తెలుగులో విశ్వనాధ్ గారిని మించిన దర్శకులు లేరు.


