ఇంటర్వ్యూ: రీతూ వర్మ- టక్ జగదీశ్ లో నాపాత్ర అదే..!

Published on Apr 11, 2020 8:00 pm IST

ఎన్టీఆర్ హీరోగా 2013లోవచ్చిన బాద్షా చిత్రంలో ఓ చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రీతూ వర్మ, పెళ్లి చూపులు సినిమాతో సక్సెస్ అందుకోవడంతో పాటు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రీతూ వర్మ 123తెలుగు.కామ్ కి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ విశేషాలు మీకోసం…

 

కరోనా వైరస్ కారణంగా ఎదురైన ఈ లాక్ డౌన్ ని ఎలా ఫీలవుతున్నారు?

చైనాలో ఈ వైరస్ విజృభిస్తుంది అని విన్నప్పుడు అంతగా దీని గురించి ఆలోచించలేదు. లాక్ డౌన్ అనౌన్స్ చేసే సమయంలో టక్ జగదీష్ సినిమా షూటింగ్ కోసం గోదావరి జిల్లాలలో ఉన్నాను. ప్రస్తుతం ఇంటికే పరిమితం అవుతున్నాను. కొంచెం బోర్ కొడుతుంది అయినా తప్పదు, ఇది మన సేఫ్టీ కోసమే కదా..

 

కనులు కనులను దోచాయంటే విజయం ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

ఈ సినిమా కోసం చాల రోజులు కష్టపడ్డాం, సుదీర్ఘ కాలం షూటింగ్ చేయడం జరిగింది. విడుదల తరువాత మంచి రెస్పాన్స్ దక్కడంతో ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా నా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అన్ని భాషలలో ఈ మూవీ విజయం సాధించింది.

 

తెలుగులో మీ లాస్ట్ మూవీ 2017లో వచ్చిన కేశవ..ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది?

నాకు తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ కొన్ని కారణాలతో వాటిని నేను రిజెక్ట్ చేశాను. ఈ స్టేజ్ లో వచ్చిన సినిమాలను చేయను అనడం కెరీర్ కి రిస్క్, కానీ నేను నమ్మిన దానికి కట్టుబడి వాటిని వదులుకున్నాను, అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది.

 

తెలుగు, తమిళ పరిశ్రమల మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా?

కనులు కనులను దోచాయంటే చిత్రం తరువాత నాకు తమిళ పరిశ్రమపై అపారమైన గౌరవం పెరిగింది. ఓ నెగెటివి రోల్ చేస్తాను అని నేడు ఎప్పుడూ అనుకోలేదు. ఇక తెలుగు,తమిళ పరిశ్రమల మధ్య పెద్దగా తేడాలు ఏమి వుండవు.

 

మీరు చేస్తున్న నాని టక్ జగదీశ్, శర్వానంద్ చిత్రాల గురించి చెప్పండి?

టక్ జగదీశ్ లో నాది ఓ పల్లెటూరి అమ్మాయి పాత్ర. ఇక ఈ చిత్రంలో ఎమోషనల్ గా నాని అలరిస్తారు. ఇక శర్వా చేస్తున్న మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ మూవీ గురించి ఇంతకు మించి ఏమీ చెప్పలేను.

 

మరి ఎవరినైనా ప్రేమిస్తున్నారా?

(నవ్వుతూ) నాతో పనిచేసిన చాల మంది హీరోలలో అందగాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేయను అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.

 

వెబ్ సిరీస్ లలోకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు?

మొదట్లో వెబ్ సిరీస్ లపై, అందులోని కంటెంట్ పై సదాభిప్రాయం ఉండేది కాదు. ఇప్పుడు నా ఆలోచన తీరు మారింది. వెబ్ సిరీస్ లో వస్తున్న చాల సిరీస్ లు మంచి కంటెంట్ తో తెరకెక్కుతున్నాయి. మంచి పాత్ర చేసే అవకాశం దక్కితే తప్పకుండ చేస్తాను.

సంబంధిత సమాచారం :

X
More