నటుడు నందు ప్రధాన పాత్రలో దర్శకుడు వరప్రసాద్.వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదలకానుంది. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావు ఇప్పిలి సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రం గురించి హీరో నందు మాట్లాడుతూ ఇదొక కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్, ఇందులో నా పాత్రకు ఒక హీరోకి ఎన్ని ఎలివేషన్ ఉండాలో అన్నీ ఉన్నాయి. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడ పుష్కలంగా ఉంటాయి అన్నారు. ఇందులో రక రకాల పరిస్థితులు ఉంటాయి. అందుకే ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ అనే టైటిల్ పెట్టాం, యాజమాన్య అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అవుతుంది, సినిమా తప్పకుండ హిట్టవుతుందని అన్నారు.


