సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూతురు గా శృతి హాసన్?

సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూతురు గా శృతి హాసన్?

Published on Apr 16, 2024 9:38 PM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ (Lokesh) కనగరాజు లియో (Leo) చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో తలైవర్ 171 (Thalaivar 171) ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 22 వ తేదీన ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం లో రజినీకాంత్ కి కూతురు గా శృతి హాసన్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే టైటిల్ టీజర్ విడుదల రోజున దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు