విశ్వంభర: వేరే లెవెల్లో ఇంటర్వల్ సీక్వెన్స్!

విశ్వంభర: వేరే లెవెల్లో ఇంటర్వల్ సీక్వెన్స్!

Published on Apr 22, 2024 3:11 PM IST


డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం విశ్వంభర. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ డ్రామా ను వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక గా నటిస్తుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ చేత ఏర్పాటు చేయబడిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన భారీ సెట్‌లో చిత్ర యూనిట్ భారీ ఇంటర్వల్ స్టంట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది.

రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ ద్వయం పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి మరియు ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ ఫైట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ వేరే లెవెల్లో ఉండనుంది. ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్‌లో షూట్ చేయడం జరిగింది. చిరు ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని రోజులు కేటాయించడం ఇదే తొలిసారి. ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తవుతుంది. ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ ను విపరీతం గా ఆకట్టుకోనుంది.

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ లెన్స్‌మెన్ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు