అనీల్ రావిపూడి – వెంకటేష్ మూవీ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో!

అనీల్ రావిపూడి – వెంకటేష్ మూవీ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో!

Published on Mar 28, 2024 10:11 PM IST

గతేడాది నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి చిత్రం ను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఈ డైరెక్టర్ నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కి సంబందించిన లేటెస్ట్ ఇన్ఫో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం విలేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోంది అని తెలుస్తుంది. ప్రతి చిత్రం లో డిఫెరెంట్ ఎలిమెంట్స్ ను చూపించే డైరెక్టర్ అనీల్, ఈ చిత్రం లో కూడా అలానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం కి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా, రెండు పాటలు పూర్తి అయ్యాయి అని సమాచారం. సినిమాను త్వరలోనే అనౌన్స్ చేసి, ఈ ఏడాది జూన్ లేదా జూలై లో షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు