“సలార్” లో ప్రభాస్ వాడిన ఐకానిక్ బైక్ ను గెలుచుకునే అవకాశం!

“సలార్” లో ప్రభాస్ వాడిన ఐకానిక్ బైక్ ను గెలుచుకునే అవకాశం!

Published on Apr 18, 2024 6:30 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ (Salaar). ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 21, 2024 న ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో ఈ చిత్రం సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం కానుంది.

అయితే సలార్ టీమ్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. సలార్ మూవీ లో ప్రభాస్ వాడిన ఐకానిక్ బైక్ ను గెలుచుకునే అవకాశం అంటూ పోస్ట్ చేసింది. స్టార్ మా లో ప్రసారం అయ్యే టైమ్ లో ఇచ్చిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పిన వారికి ఈ బైక్ గెలిచే అవకాశం ఉంది. చివరిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని పేర్కొంది. అయితే ఈ ప్లాన్ ప్రభావం టీఆర్పీ రేటింగ్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బుల్లితెర పై సలార్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు