ఆకట్టుకుంటున్న ప్రభాస్ “కల్కి” లేటెస్ట్ పోస్టర్!

ఆకట్టుకుంటున్న ప్రభాస్ “కల్కి” లేటెస్ట్ పోస్టర్!

Published on May 28, 2024 11:02 PM IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD మూవీ జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం ను డిఫెరెంట్ గా ప్రమోట్ చేస్తూ, ఆడియెన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే బుజ్జి X బైరవ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించి అంచనాలను పెంచేశారు. తాజాగా చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ బుజ్జి తో స్టైలిష్ గా నిలబడి ఉన్నారు. లుక్ చాలా బాగుంది. ఈ చిత్రం రిలీజ్ కి ఇంకా 30 రోజుల సమయం ఉన్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు