“సరిపోదా శనివారం” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్!

“సరిపోదా శనివారం” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్!

Published on Feb 22, 2024 10:57 PM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా బిగ్ అప్డేట్ ను ఇవనున్నారు మేకర్స్. నేడు మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరో నాని బ్యాక్ పోస్ తో ఉన్న పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ శనివారం ఉదయం 11:59 గంటలకు సినిమాకి సంబందించిన టీజర్ రిలీజ్ కానుంది.

నాని చాలా కాలం తర్వాత యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తుండటం తో సినిమాపై అభిమానులలో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో తమిళ నటుడు, డైరెక్టర్ SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు