RC16 సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు!

RC16 సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు!

Published on Feb 24, 2024 10:06 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం RC16. ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కి సంబందించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేయడం జరిగింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేలు ఈ సినిమా కి డీఓపి గా వ్యవహరిస్తున్నారు. టీమ్ లోకి ఆహ్వానం పలుకుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్ న రిలీజ్ చేశారు. నేడు రత్నవేలు బర్త్ డే కావడం తో బెస్ట్ విషెస్ తెలిపారు.

మైత్రి మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో లేడీ లీడ్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుంది. ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు