రణ్బీర్ కపూర్ “రామాయణ” మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

రణ్బీర్ కపూర్ “రామాయణ” మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Apr 12, 2024 5:14 PM IST

బాలివుడ్ స్టార్ యాక్టర్ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) చివరిసారిగా అనిమల్ మూవీ లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ హీరో ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కన్నడ స్టార్ హీరో యష్ ఈ చిత్రం కోసం రెడీ అయిపోయారు. అయితే ఈ చిత్రం నిర్మాణం కోసం అని తెలుస్తొంది. ప్రైమ్ ఫోకస్ కి చెందిన నమిత్ మల్హోత్రా తో మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా హీరో యశ్ చేతులు కలుపుతున్నారు. చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ న్యూస్ తో సినిమా పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో హీరో యష్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు