‘అఖిల్ 4’లో లవ్ సీన్స్ పూర్తి చేశారట !

‘అఖిల్ 4’లో లవ్ సీన్స్ పూర్తి చేశారట !

Published on Jan 23, 2020 7:09 AM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే లాస్ట్ షెడ్యూల్ లో చిత్రబృందం ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ ను కూడా షూట్ చేశారట. లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో. అయితే ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి . దాంతో తన తరువాత సినిమాల పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమాకి కూడా అఖిల్ దగ్గర ఉండి సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు