“ఫ్యామిలీ స్టార్” టీజర్ పై విజయ్ దేవరకొండ పోస్ట్!

“ఫ్యామిలీ స్టార్” టీజర్ పై విజయ్ దేవరకొండ పోస్ట్!

Published on Mar 1, 2024 1:56 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అవుతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దివ్యాన్ష కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం టీజర్ పై హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు. టీజర్ వస్తుంది అని అన్నారు. ఇదే విషయాన్ని తెలుగు మరియు తమిళ భాషలో పోస్ట్ చేశారు. టీజర్ కోసం ఎదురు చూస్తున్నాము అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు